శ్రీ రామ సేవా సమితి
లోక క్షేమం కోసం ఆధ్యాత్మిక సేవా ఉద్యమం
రామ సేవా సమితి అనేది ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రజల మధ్య వ్యాప్తి చేయాలనే ఉన్నత ఉద్దేశంతో స్థాపితమైన సంస్థ. సమాజంలోని ప్రతి వ్యక్తి లో ఆధ్యాత్మిక ద్వారా పరమాత్మ సేవ సాధించాలనే మహత్తర సంకల్పంతో బస్తీల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.
కార్యాచరణలు:
1. శ్రీరామ నామ స్మరణ

శ్రీ రామ నామమే పరమ శక్తిగా నమ్మి, బస్తీల్లో రామ నామ స్మరణను నిత్యం ప్రోత్సహిస్తున్నారు. భక్తితో “శ్రీరామ జయ రామ జయ జయ రామ” అంటూ నామస్మరణ చేస్తూ జనహృదయాల్లో ఆధ్యాత్మికతను నాటుతున్నారు.

2. హనుమాన్ చాలీసా పారాయణం

ప్రతి నెలలో 41 సార్లు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం ద్వారా భక్తులకు మానసిక శాంతిని కలిగిస్తున్నారు. విద్యార్థులకూ దీనిలో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ భక్తి, ధైర్యాన్ని పెంపొందిస్తున్నారు.

3. నగర సంకీర్తన

బస్తీల్లో, వీధులలో సామూహికంగా రామ నామ సంకీర్తన నిర్వహించడం ద్వారా ప్రజలలో భక్తిసాంస్కృతిక చైతన్యం కలిగిస్తున్నారు. ఇది సమాజాన్ని సంఘటితంగా, సత్సంకల్పంతో ముందుకు నడిపించే సాధనంగా ఉంది.

4. సీతా రామ కళ్యాణం కోసమే తలంబ్రాల వోలిపించడము.

భక్తులతో కలసి వొలిచిన గోటి తలంబ్రాలు తో సీతా రాముల కళ్యాణం జరపడం ద్వారా సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇది భక్తుల కలిసికట్టుగా పని చేయడానికి, పరస్పర సత్సంభంధాలను పెంచడానికి మార్గం.

5. విద్యార్థులకు హనుమాన్ చాలీసా నేర్పించడం

విద్యార్థులకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని అలవాటు చేస్తూ, వారి మనోబలాన్ని, చిత్తశుద్ధిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

6. భగవద్గీత బోధన

బాలబాలికలకు, యువతకు భగవద్గీత బోధన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జీవితానికి అవసరమైన ధర్మబోధ, ఆత్మబలాన్ని అందిస్తున్నారు.

7. గీతా ప్రచారం మరియు గీతా జయంతి ఉత్సవాలు

భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం అనే దృష్టితో గీతా జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ గీత ప్రసారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు.

శ్రీ రామ సేవా సమితి లక్ష్యం:

శ్రీ రామ సేవా సమితి లక్ష్యం, ధర్మాన్ని, నైతిక విలువలను, ఆధ్యాత్మికతను సమాజం నలుమూలలా వ్యాపింపజేయడం. ప్రతి బస్తీలో భగవంతుని సేవ, భక్తి మార్గంలో ప్రజల జీవితాలలో శాంతి, ఆనందాన్ని నింపడమే సంకల్పం.

శ్రీ రామ సేవా సమితి సేవా యజ్ఞానికి మీరు భాగస్వాములు కావాలనుకుంటే, సంప్రదించండి. మనం కలసి ధర్మాన్ని నిలుపుదాం.

Copy Rights Reserved @ Sri Rama Seva Samiti