శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో గీతా జయంతి మహోత్సవం ప్రతి ఒక్కరికీ ఆహ్వానము
శ్రీ రామ సేవా సమితి తన ధార్మిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది 30 నవంబర్ 2025 ఆదివారం నాడు గీతా జయంతి మహోత్సవం నిర్వహించబోతోంది. భగవద్గీత అనేది మన భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ఆదర్శ ప్రాయమైన గ్రంథం. గీతా జయంతి అంటే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో భగవద్గీతను ఉపదేశించిన పవిత్ర రోజు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామ సేవా సమితి గీతా జయంతి మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఇందులో భక్తులచే గీతా శ్లోకాల పారాయణం నిర్వహించబడతాయి.
ఈ గీతా జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఆహ్వానము . మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి ఈ పునీత కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
తేదీ : 30 నవంబర్ 2025, ఆదివారం
వేదిక : TSIIC కాలనీ
సమయం : ఉదయం 8.00 గంటల నుండి ప్రారంభం
ఓం శ్రీ కృష్ణార్పణమస్తు🙏
– శ్రీ రామ సేవా సమితి